31-01-2026 12:56:44 AM
చేవెళ్ళ జనవరి ౩౦(విజయక్రాంతి): మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం ప్రెస్మీట్ నిర్వహించారు. బీజేపీ పార్టీ కి ప్రజల్లో ఆదరణ ఉందని, కేంద్రమిచ్చిన నిధులతో చేసిన అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం తమగొప్పాలుగా చెప్పుకుంటుండ్రని మండిపడ్డారు. ఇందుకు కేంద్రామిచ్చిన నిదులే సాక్ష్యం అన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. దేవాలయ భూములు ప్రభుత్వం బడా కంపెనీలకు అమ్మి అభివృద్ధికి వాడుతుండ్రని మండిపడ్డారు. చర్చ్ మిషనరీ వేక్ప్ భూములను జోలికి ఎందుకు పోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గుడి భూముల అమ్మకంతో వచ్చిన బబ్బుతో చర్చ్ మజీద్ లకు వాడుతుండ్రని తద్వారా గుడి భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బిజెపి పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం, మాజీ ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, భాజపా చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అతెల్లి అనంతరెడ్డి, యువ నాయకులు డా. మల్గారి వైభవ్ రెడ్డి, పార్టీ నాయకులు ఆంజనేయులు గౌడ్, రమణ రెడ్డి, కుంచం శ్రీనివాస్, వెంకటరెడ్డి, మాణిక్య రెడ్డి, శర్వలింగం, వెంకట్ రామ్ రెడ్డి, కృష్ణ గౌడ్, అశోక్ పత్తి సత్యనారాయణ, జయశంకర్ గౌడ్, గాజులగూడెం శ్రీనివాస్ రెడ్డి కె.శ్రీనివాస్ కరుణాకర్ రెడ్డి, పల్గుట్ట బాలు, గణేష్ చందు శ్రీకాంత్ రెడ్డి పాగా వెంకటేష్, రవీందర్, త్రినేత్ర రామకృష్ణ కార్యకర్తలు పాల్గొన్నారు.