calender_icon.png 31 January, 2026 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్ని కల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం

31-01-2026 01:14:23 AM

మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి

మేయర్ అభ్యర్థిగా చైతన్య నామినేషన్ దాఖలు

నల్లగొండ, జనవరి 30(విజయక్రాంతి): ఫిబ్రవరి 11న జరిగే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. శుక్రవా రం తన సతీమణి, మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్యచే 32వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు.ఈ సందర్భం గా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్లగొండను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా చేయడంతో కేంద్ర,రాష్ట్రాల నుంచి అత్యధిక నిధులు వస్తాయన్నారు. దీంతో నల్లగొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.

ఇప్పటికే పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో నల్గొండలో అభివృద్ధి శూన్యమని అన్నా రు. మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య మాట్లాడుతూ తనను మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సహకారంతో నల్గొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు పోతానని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగాల అనిల్ రెడ్డి, బండా వెంకటేశ్వర్ రెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి, భోదనం సుధాకర్ రెడ్డి,ఖమ్మం పాటి శేఖర్, సైదులు గౌడ్, అలుగుబెల్లి కిరణ్ రెడ్డి, బండ అంజిరెడ్డి,వంగాల సుమతి, రాపర్తి నరసింహ తదితరులు పాల్గొన్నారు.