calender_icon.png 2 January, 2026 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాతలకు అండగా బీఆర్‌ఎస్ పోరు

02-01-2026 12:24:54 AM

రైతుల సమస్యలపై దశలవారీ ఆందోళనలు...

నేడు జాతీయ రహదారిపై నిరసన, 6న ఆదిలాబాద్ బంద్‌కు పిలుపు...

మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): రైతుల పంటలను కొనుగోళు చేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. ప్రభుత్వాల వైఖరికి నిరసనగా రైతులకు అండగా బీఆర్‌ఎస్ శుక్రవారం నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. ఈ మేరకు గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆందోళనల వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన పంటల కోనుగోళు విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్య దోరణి ఆవలంబిస్తున్నాయని మండిపడ్డారు.

కొన్ని రోజులుగా ఆయా మండలాల రైతులు పంటల కొనుగోళు చేయాలని ఆందోళనలు చేసిన ఫలితం లేకుండా పోతుందన్నారు. కొనుగోళ్లు సజావుగా సాగించేందుకు కలెక్టర్ త్రీమెన్ కమిటీ వేశారని, ఆ కమిటీ నిర్దరించిన పంట మార్కెట్ కు వచ్చి వెనక్కి పోయిన దాఖలాలు ఉన్నాయన్నారు. ఇలా అయితే కమిటీ వేయడం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా రైతులకు అండగా శుక్రవారం జైనథ్ మండలం కాప్సి ఎక్స్ రోడ్డు వద్ద రాస్తారోకో కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కొనుగోలుపై స్పష్టత వచ్చే వరకు రోడ్డుపై బైఠాయిస్తామన్నారు.

పోలీసులు అరెస్టు చేసిన కూడా స్టేషన్ లో నిరసన కొనసాగిస్తామన్నారు. అదే విధంగా శనివారం ఎంపీ, ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి, సోమవారం కలెక్టరేట్ ముట్టడి, మంగళవారం (6న) ఆదిలాబాద్ బంద్‌కు పిలుపు ఇవ్వడం జరుగుతుం దన్నారు. రైతు లేనిదే రాజ్యాం లేదని, ప్రజలు కూడా రైతుల పక్షన బీఆర్‌ఎస్ చేస్తున్న ఉద్యమాలకు సహకరించాలని కోరారు. మంగళ వారం ఆదిలాబాద్ బంద్ ప్రజలు, వ్యాపారు లు స్వచ్చందంగా పాల్గొని బంద్ పాటించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు అజయ్, సాజితోద్దీన్, మెట్టు ప్రహ్లాద్, యూను స్ అక్బాని, లింగారెడ్డి, ప్రమోద్ రెడ్డి, గోవర్ధన్, గణేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.