02-01-2026 12:23:27 AM
ఎస్పీ అఖిల్ మహాజన్...
ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు తిరిగి అందజేత
ఆదిలాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ లేనిదే ఎలాంటి పని జరగని సందర్భంలో మనకు అత్యంత విలువైనది, తక్కువ సమయంలో ఎక్కువ పని చేసే సాంకేతిక పరికరం మొబైల్ ఫోన్, మొబైల్ ఫోన్ లో అన్ని వివరాలు, అన్ని జ్ఞాపకాలు, అన్ని లావాదేవీలకు సంబంధించి న అప్లికేషన్లు ఉంటాయనీ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సాధారణంగా ప్రజలు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న, దొంగతనం జరిగిన ఎలాంటి భయాందోళన అవసరం లేదన్నారు. వాటిని తిరిగి పొందాలంటే బాధితులు వెంట నే https://www.ceir.gov.in అనే వ్బుసైట్ లో లేదా దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని జిల్లా ఎస్పీ సూచించారు.
జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి సంపాదించడం కోసం ప్రత్యేకంగా రికవరీ బృందా న్ని ఏర్పాటు చేశామని, గత 40 రోజుల వ్యవధిలో దాదాపు వివిధ రాష్ట్రాల నుండి జిల్లాల నుండి బాధితులు పోగొట్టుకున్న, దొంగలించబడిన 200 మొబైల్ ఫోన్లను తిరిగి రాబట్ట డం జరిగిందన్నారు. పోయిన ఫోన్‌లను ఇంత పెద్ద మొత్తంలో రాబట్టడం జిల్లా చరిత్రలోనే ప్రథమం అన్నారు. లభించిన మొబైల్ ఫోన్ల ను తిరిగి ఇచ్చే క్రమంలో గురువారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశం మందిరం లో జిల్లాలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న, చోరీకి గురైనటువంటి బాధితులకు 200 మొబైల్ ఫోన్లు, దాదాపు 39.1 లక్షల విలువ చేసే వివిధ ప్రాంతాల బాధితులకు తిరిగి అందజేయడం జరిగింది.
జిల్లాలో ఇప్పటి వరకు 1,500 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేయడం జరిగిందని ఎస్పీ తెలిపా రు. మొబైల్ ఫోన్ దుకాణాల యజమానులు, రిపేరింగ్ దుకాణాల యజమానులు, మొబైల్ ఫోను కొనే ముందు మొబైల్ ఫోన్ యజమా ని అనుమతి సరైన పత్రాలు తీసుకోవాలి, దొంగ మొబైల్ ఫోన్లు కొన్న ఎడల వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ముఖ్యంగా స్వాధీనం చేసుకు న్న మొబైల్ ఫోన్లు ఉత్తర భారతదేశంలో ఉం డటం వాటిని ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో తిరిగి రాబట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఏఎస్పీ పి. మౌనిక, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, ప్రత్యేక బృందం సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.