19-12-2025 12:06:36 AM
ఖమ్మం టౌన్, డిసెంబర్ ౧౮ (విజయ క్రాంతి): ఖమ్మం జిల్లా కారేపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శుభ కామేశ్వరీ దేవి గురువారం అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ. 10 వేల నగదును లంచంగా స్వీకరిస్తూ ఏసీబీ అధికారు లకు పట్టుబడినట్లు సమాచారం. ఏ సి బి డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో పట్టుకొన్నారు.