01-07-2025 12:08:37 AM
పెద్దమందడి జూన్ 30 :పెద్దమందడి మండల పరిధిలోని జంగమాయపల్లి గ్రామపంచాయతి కార్మికురాలు వీరపాగ శారద సోమవారం విద్యుత్ షాక్ గురై గాయాలైనట్లు మాజీ సర్పంచ్ వీరపాగ సత్యం తెలిపారు. గ్రామస్తులు కథనం ప్రకారం గ్రామంలోని త్రాగునీటి బోరు సమీపంలో గడ్డి తొలగిస్తుండగా బోర్ మోటార్ వైరు తగిలి విద్యుత్ షాక్ గురైనట్లు వారు తెలిపారు. గాయలైన కార్మికురాలిని వెంటనే వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శిక్షిత నిర్వహించి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు.