29-07-2025 04:37:15 PM
సదాశివనగర్ (విజయక్రాంతి): సదాశివనగర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బొల్లిపల్లి మహేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నియోజకవర్గనికి చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ కోసం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఆయనతో పాటు అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మూదాం సత్యం, గోపయ్య గారి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గంగాసాని సాగర్ రెడ్డి, వాదుల నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.