calender_icon.png 30 July, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం

29-07-2025 04:39:35 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని గుడ్ షెఫర్డ్ హై స్కూల్లో(Good Shepherd High School) మంగళవారం అటవీశాఖ ఆధ్వర్యంలో జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు పులుల యొక్క ఆవశ్యకత గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఓ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. గత 20 సంవత్సరాల నుండి పులులు అంతరించిపోతున్నాయని వాటిని రక్షించి వాటి యొక్క సంఖ్యా పెంచడానికి ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. పులులను రక్షించడానికి అడవుల్లో కుంటలు, సాసర్ ఫీట్స్, గ్రాస్ ల్యాండ్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఆరు నెలల నుండి ఆడపులి లక్షెట్టిపేట ఫారెస్ట్ రేంజ్ పరిధి అడవులలో తిరుగుతున్నట్లు దానికోసం సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. కవ్వాల్ టైగర్ రిజర్వుల్లోకి తడోబా నుంచి పులులు వస్తున్నాయని వారిని రక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఫారెస్ట్ ఉన్నత అధికారులు చేస్తున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వై. శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెబస్టియన్, ఎఫ్బిఓ లు అత్యే సత్తయ్య, రాజశేఖర్, రాజమణి, సుమలత, ఎనిమల్ ట్రాకర్ కలీం, విద్యార్థులు పాల్గొన్నారు.