29-07-2025 04:34:55 PM
బైంసా: భైంసా డివిజన్లో బుధవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) తెలిపారు. బైంసా పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఏ అవసరాలు ఉన్న పోలీస్ శాఖను సంప్రదిస్తే సత్వర న్యాయం జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని తెలిపారు.