09-10-2025 07:50:13 PM
దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్..
దేవరకొండ (విజయక్రాంతి): రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
ఆరు గ్యారంటీలు, 420 హామీలు అని అన్ని వర్గాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆయన తెలిపారు. అభయహస్తం మేనిఫెస్టోలో మహాలక్ష్మి పేరిట ఇచ్చిన గ్యారెంటీలోని మొదటి హామీ ప్రతి మహిళకు నెలకు రూ.2500 గురించి ప్రస్తావన లేదు అని ఆయన అన్నారు.చివరి గ్యారెంటీ చేయూతలో చెప్పిన రూ.4000 పింఛన్ గురించి ఒక్క మాట లేదు.ఇగ 420 హామీలకు దిక్కే లేదు అని అన్నారు.పరిపాలన గాలికి వదిలి, ప్రతీకార చర్యలకు ప్రభుత్వం దిగింది అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.