09-10-2025 07:40:36 PM
దేశ బోయిన హరీష్ యాదవ్..
తిలకం దిద్ది ప్రకటించిన వెంపటి గ్రామస్తులు..
తుంగతుర్తి (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీగా తనను ఆదరించి గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తానని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దేశ బోయిన హరీష్ యాదవ్ అన్నారు. వెంపటి గ్రామ ఎంపీటీసీ స్థానానికి, స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిపేందుకు ఆ పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షుడు యువకుడైన దేశ బోయిన హరీష్ యాదవ్ ను గ్రామ నాయకులు కార్యకర్తలు, అందరూ ముక్తకంఠంతో ఎంపీటీసీ అభ్యర్థిగా ప్రకటించారు.
ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... యువకుడినైనా నన్ను తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు డాక్టర్ కిషోర్ కుమార్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా నాపై బాధ్యతలు ఉంచితే నిస్వార్ధంగా పార్టీ అభివృద్ధికి కష్టపడి పని చేశానని తెలిపారు. గత పది సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల్లో గ్రామంలో ఏ ఒక్క అభివృద్ధి పనులు కూడా మొదలు పెట్టలేదని ఎద్దేవ చేశారు. మీ బిడ్డగా, యువకుడిగా మీ ముందుకు వస్తున్న ఆలోచించి, యువతకు పట్టం కట్టాలని అన్నారు.