calender_icon.png 2 December, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాస్కెట్ బాల్ క్రీడాకారులకు బహుమతుల ప్రదానం

02-12-2025 02:20:15 AM

అందజేసిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి

సంగారెడ్డి, డిసెంబర్ 1 :అంతర్ జిల్లా 11వ సీనియర్ బాస్కెట్ బాల్ ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా జరిగింది. పురుషుల విభాగంలో హైదరాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానం, రెండోవ స్థానంలో రంగారెడ్డి జిల్లా జట్టు, తృతీయ స్థానంలో మేడ్చల్ జిల్లా జట్టు నిలిచారు.

మహిళల విభాగంలో మొదటి స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి, రెండవ స్థానంలో హైదరాబాద్ జిల్లా జట్టు, మూడవ స్థానంలో రంగారెడ్డి జిల్లా జట్టు నిలవడం జరిగింది.  విజేతలను నిర్మలా జగ్గారెడ్డి అభినందించి మెడల్స్, ట్రోఫీని అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పృద్వేశ్వర్ రెడ్డి, మెదక్ జిల్లా బాస్కెట్ బాల్ అధ్యక్షులు రమేష్, రాష్ట్ర కోశాధికారి చంద్రశేఖర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి ఆనంత కిషన్, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.