19-08-2025 12:00:00 AM
పూజలు చేసిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
అడ్డాకుల ఆగస్టు 18: లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులు దీవెనలు అందరూ పొందాలని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని కాటవరం గ్రామ శివారులో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నూతన ధ్వజ స్తంభ ప్ర తిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి ఆలయంలో గణపతి, పూజ, ప్రత్యేక హోమం, పూజలు నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రచరణల నడుమ నారప్పతో చేసిన ధ్వజస్వంభాన్ని ప్రతిష్ట చేశారు.
ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ. జి. మధుసూదన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు కమిటీ ఆధ్వర్యంలో కాలువతో ఘనంగా స న్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తోట శ్రీహరి, విజయ మోహన్ రెడ్డి, దశరథ్ రెడ్డి, శేఖర్ రెడ్డి, వేగనాద్ బన్ను, కాటవరం ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మల్లేష్, గ్రామస్తులు నాయకులు పాల్గొన్నారు.