calender_icon.png 4 November, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

03-11-2025 06:09:48 PM

చివ్వెంల (విజయక్రాంతి): రైతులు శ్రమించి పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి తెలిపారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు పొందాలని ఆయన రైతులను కోరారు. చివ్వెంల మండలంలోని మొగ్గాయిగూడెం, చందుపట్ల, బీబీగూడెం గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేణారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పూర్తి సన్నద్ధతతో కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

రైతుల కోసం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఐకెపి సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచిందని తెలిపారు. వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తీసుకువచ్చే ముందు తేమ శాతం తగ్గేలా బాగా ఆరబెట్టుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినది కాంగ్రెస్ ప్రభుత్వం అని వేణారెడ్డి పేర్కొన్నారు. రైతు క్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చివ్వేంల ఎమ్మార్వో, ఎంపిడివో, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు గాయం చంద్రశేఖర్ రెడ్డి, అనిత, కోడిరెక్క కొండల్, గుద్దేటి వెంకన్న, బొడుపుల హరికృష్ణ, ముద్ద వెంకన్న, అనంతుల సైదులు తదితరులు పాల్గొన్నారు.