21-08-2025 01:42:04 AM
నాగార్జునకొండ విశేషాలను వివరించిన శివనాగిరెడ్డి
నాగార్జునసాగర్, ఆగస్టు 20: విజయ క్రాంతిఃనాగార్జునసాగర్ లోని బుద్ధవనం ప్రాజెక్టు ఒక అద్భుత బౌద్ధ వారసత్వ పర్యాటక స్థావరమని అమెరికాలోని హ్యూస్టన్ నగరం వియత్నాం బౌద్ధ విహార ప్రధానాచార్యులు థామ్ పేర్కొన్నారు. ఇక్కడి కట్టడాలు, శిల్పాలు ఆచార్య నాగార్జున స్ఫూర్తిని ఈ తరానికి తెలియజేస్తున్నయన్నా రు. బుధవారం బౌద్ధ పరిశోధకుడు,ప్లీ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి హ్యూస్టన్ లోని బుద్ధ విహారాన్ని, మూడంతస్తుల పగోడాను,
72 అడుగుల ఖ్యాన్ ఆమ్ బోధిసత్వ విగ్రహాన్ని సందర్శించి, ప్రధాన బౌద్ధ ఆచార్యులను కలిసి కృష్ణా తీర బౌద్ధ వారసత్వ స్థలాలు, బౌద్ధాచార్యులు, అమరావతి- నాగార్జున కొండ, ఇంకా నాగార్జునసాగర్ లో నిర్మించిన బుద్ధవనం గురించి వివరించి, బుద్ధవనానికి సంబంధించిన వీడియోను ప్రదర్శించగా ధామ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని శివనాగిరెడ్డి తెలిపారు. తాను నాగార్జున కొండను సందర్శించాలని అనుకుంటున్నానని ఆయన వెల్లడించారు.