calender_icon.png 27 August, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుదేరా మహిళా కళాశాలను మోడల్‌గా తీర్చిదిద్దాలి

27-08-2025 01:22:11 AM

మునిపల్లి, ఆగస్టు 26 : మునిపల్లి మండలంలోని బుధేరా గ్రామంలో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ , పీజీ మహిళా కళాశాలను మోడల్ కళాశాలగా తయారు చేసేందుకు మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రత్యేకంగా చర్చించారు.

ఈ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, హాస్టల్లో వసతి సదుపాయాల పెంపు, డార్మెటరీ సౌకర్యాలు, డైనింగ్ హాల్ విస్తరణ, నూతన కిచెన్ పరికరాలు, ల్యాబ్ సామగ్రి వంటి అవసరాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను మంగళవారం ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టీఎస్ ఈటిఎస్‌ఈడబ్ల్యూ ఐడిసి శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బిఈఈ రవి కుమార్ , రెవిన్యూ , పోలీస్ , వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.