27-08-2025 01:24:03 AM
- నారాయణరావుపేట పి.హెచ్.సీ ఆకస్మిక తనిఖీలు వెలుగు చూసిన వైనం
సిద్దిపేట రూరల్, ఆగస్టు 26: ఉద్యోగులు సమయపాలన పాటించకపోతే ఆరోజు వేతనం క ట్ చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం నారాయణరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ నిర్వహణ సరిగా లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీహెచ్సీ డాక్టర్ రాలేదంటూ ప్రశ్నించగా డాక్టర్ సెలవులో ఉన్నట్లు సిబ్బంది చెప్పడంతో సెలవు పత్రాన్ని పరిశీలించి జిల్లా వై ద్యాధికారితో ఫోన్ లో మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సమయంలో సెలవులు ఇవ్వరాదని ఆదేశించారు. వైద్య ఉద్యోగులు సునీత చింతమడకలో, పాండురంగ చారి చిన్న గుం డవెల్లిలో, సుధారాణి వివిధ గ్రామాలలో ఉన్నట్లు చెప్పడంతో వారిని వీడియో కాల్ ద్వారా లొకేషన్ తెలుసుకున్నారు. వారు ఎవరు కూడా ఆయా గ్రామాలలో లేకపోవడం వల్ల ఆ ఉద్యోగులకు మంగళవారం జీతం కట్ చేయాలని జిల్లా అధికారిని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వాయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.