19-09-2025 12:00:00 AM
కరీంనగర్, సెప్టెంబరు18 (విజయ క్రాంతి): కరీంనగర్ వాసులకు నాణ్యమైన పరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు అందించేందుకు కరీంనగర్ లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పూలు, పండ్లు, కూరగాయలు, మాంసం ఒకేచోట అందుబాటులో ఉంచే లక్ష్యంతో నగరం నలుమూలల వీటిని నిర్మించాలని నిర్ణయించి ఎమిదేళ్ళక్రితమే శ్రీకారం చుట్టారు. ఒక్కో దానికి రూ. 10 కోట్ల కేటాయించారు.
కరీంనగర్ ప్రజల అవసరాలకు అనుగుణంగా సరిపడా మార్కెట్లు లేవు. దీంతో ప్రధానరోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు. మాంసాన్ని సైతం అపరిశుభ్ర కరమై వాతావరణంలో అమ్ముతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతున్నాయి. రోడ్లపైనే విక్రయాలు సాగిస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని సమీకృత మార్కె ట్ల నిర్మాణానికి రూపకల్పన చేశారు.
ప్రస్తు తం ఉన్న ప్రధాన కూరగాయల మార్కెట్, కశ్మీర్గడ్డ రైతుబజార్, రాంనగర్, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల, ఇందిరానగర్ మార్కెట్లలో అమ్మకాలు సాగుతున్నాయి. వీటితో పాటు ప్రధా న మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్, రాంనగర్, కశ్మీర్గడ్డలోని ఫిష్ మార్కెట్లు సాగుతు న్నాయి. అయితే, ఈ ప్రాంతాల్లో సరైన పా ర్కింగ్ సౌకర్యం లేక కొందరు రోడ్లపైకి వచ్చి అమ్మకాలు సాగిస్తుండడంతో పదే పదే ట్రా ఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
దీంతో వీ టన్నింటికీ పరిష్కారం చూపించే దిశగా ఇం టిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చు ట్టారు. స్మార్ట్ సిటీ నిధులతో పద్మనగర్ లో నిర్మించిన సమీకృత మార్కెట్కు ఆదరణ కరువైంది. నాలుగింటిలో ఒకే ఒక సమీకృత మార్కెట్ పద్మనగర్లో పూ ర్తయ్యింది. పట్టణ ప్రగతి నిధులతో వ్యవసా య మార్కెట్ ఆవరణలో, కలెక్టర్ బంగ్లా ఎదుట చేపట్టిన మార్కెట్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. స్మార్ట్ సిటీ నిధులతో కాశ్మీర్గడ్డ రైతు బజారును కూల్చివేసి నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదు.
నగరపాలక సంస్థ పదవీకాలం జనవరి 29న ముగిసింది. పద్మనగర్ సమీకృత మార్కెట్ను పదవీకాలం ముగిసేందుకు మూడు రోజుల ముందు ప్రారంభిం చారు. పద్మనగర్ ప్రాంత ప్రజలే కాకుం డా పరిసర డివిజన్ల ప్రజలు, వ్యాపారులు, రై తులు తమకు ప్రయోజనం చేకూరుతుందని ఆశించారు. ప్రారంభోత్సవం అయి 9 నెల లు కావస్తున్నా మార్కెట్ వైపు అధికారులు, ప్రజా ప్రతినిధులు కన్నెత్తి చూడలేదు. ఆ తరువాత మార్కెట్లోని దుకాణాలను అర్హులైన వారికి కేటాయించారు.
తొలుత మార్కె ట్లోకి కొందరు వ్యా పారులు వచ్చి విక్రయాలు ప్రారంభించినప్పటికి కొ నుగోలు దారులు రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. సమీకృత మార్కెట్కు ప్రజలనుంచి ఆదరణ లభించడం లేదు. సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఒకే ప్రాంతంలో అ న్ని రకాల మార్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా పద్మనగర్ సమీకృత మా ర్కెట్ ని సిద్ధం చేశారు. వీటిలో వెజ్, నా న్వెజ్ మార్కెట్లతో పాటు పండ్లు, ఇతర మా ర్కెట్లను కూడా ఏర్పాటు చేసేనా నిరుపయోగంగా మారింది.
కలెక్టర్ క్యాంపు కార్యాల యం ముందు ఉన్న ఇరిగేషన్ కార్యాలయ స్థలంలో రూ. 14.50 కోట్ల వ్యయంతో అ త్యంత ఆధునిక సమీకృత మార్కెట్ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. అయితే పట్టణ ప్రగతితో చేపట్టిన ఈ మార్కెట్ పనులు ని ధులు లేక ఆగిపోయాయి. ఈ మార్కెట్లో సు మారు 300 నుంచి 350 మంది అమ్మకాలు జరుపుకొనేలా తీర్చి దిద్దాలనుకు న్నారు. వీటితో పాటు కశ్మీర్గడ్డ రైతుబజార్లో రెండతస్తులతో సమీకృత మార్కెట్ను స్మార్ట్ సిటీ నిధులతో ప్రారంభించినా నత్తనడకన పనులు సాగు తున్నాయి.
ఇక్కడి రైతులు వానలో తడుస్తూ , ఎండలో ఎండుతూ కూరగాయలు అమ్ముతున్నారు. పద్మనగర్ పరిసరాల ప్రాంతాల్లో ఉండే డివిజన్ల నాయకులు, మహిళా సంఘాలు, కాలనీ కమిటీల తో సమావేశాలను ఏర్పాటు చేసి సమీకృత మార్కెట్తో కలిగే ప్రయోజనాలను వివరించాలని ప్రజలు కోరుతున్నారు. సమీకృత మా ర్కెట్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తే రోడ్లపై పార్కింగ్, ఇతర సమస్యలు తగ్గుతాయి. ఈ దిశగా కలెక్టర్, నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
మేళా ఏర్పాటు చేస్తాం-
--పద్మనగర్ సమీకృత మార్కెట్ ను వి నియోగం లోకి తేవడానికి ప్రవయనిస్తున్నాం. దసరా సందర్బంగా మేళా ఏ ర్పా టు చేస్తాం. కూరగాయలు, పండ్లు పూల అమ్మకాలు ఈ మేళా లో ఉండే లా చూస్తాం. ఇక్కడ అమ్మకం దారులను ప్రోత్సహించేందుకు ఎలాంటి చార్జీ లేకుండా అనుమతించాము అయితే దూరంగ ఉన్న కారణంగా ఎక్కువ మం ది రాలేదు. ఈ మార్కెట్ పై ప్రజలకు అ వగాహన కల్పించేందుకు మేళా లను నిర్బహించాలని నిర్ణయించము. కాశ్మీర్ గడ్డ రైతు బజార్ స్లాబ్ పడింది. పనులు కోమసాగుతున్నాయి.
ప్రపుల్ దేశాయి కమిషనర్,
కరీంనగర్ నగరపలకసంస్థ