calender_icon.png 15 November, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు అచ్చంపేటలో సామూహిక వివాహాలు

15-11-2025 07:48:26 PM

అచ్చంపేట: అప్ప శివ జువెలర్స్ ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు, కౌన్సిలర్ గోపిశెట్టి శివ తెలిపారు. పట్టణంలోని బీకే ఫంక్షన్లో కార్యక్రమం ఉన్నదని చెప్పారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ చెందిన 100 మంది జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపిస్తున్నామని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, తెలంగాణ ఏపీకి చెందిన మంత్రులు, ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. పెళ్లి కళే ఖర్చును పూర్తిగా తానే భరిస్తున్నానని చెప్పారు.