calender_icon.png 11 May, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత సైనికులకు మద్దతుగా జర్నలిస్టుల సంఘీభావ ర్యాలీ

10-05-2025 06:41:17 PM

టీయూడబ్లుజే ఐజేయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ప్రదర్శన

కరీంనగర్,(విజయక్రాంతి): ఉగ్రవాదాన్ని ప్రేరిపిస్తున్న పాకిస్తాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేయాలని... జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయూ అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్రశేఖర్ అన్నారు. భారత సైనికులకు మద్దతుగా కరీంనగర్ లో జర్నలిస్టులు సంఘీభావ ర్యాలీ చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో టీయూడబ్ల్యూజే ఐజేయూ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు హాజరయ్యారు.

జాతీయ జెండాలను చేతబూని... భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని గుర్తుచేశారు. ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిందన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరిట చేసిన దాడులకు త్రివిధ దళాలు ప్రశంసలందుకున్నాయని చెప్పారు. తదనంతరం జరుగుతున్న కాల్పుల్లో పుట్టపర్తి సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యాడని తెలిపారు. ఆయన కుటుంబానికి యావత్ జర్నలిస్టులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. భారత్ పై కన్నెత్తి చూడాలంటే వణుకు పుట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే - ఐజేయు అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్, కోశాధికారి గాజుల వెంకట్, స్టేట్ హెల్త్ కమిటీ సభ్యులు విజయసింహారావు,  ఎన్ మహేంద్ర చారి, యాంటీ ఎటాక్ కమిటీ మెంబర్ ఈద మధుకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఏ శైలేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ పోలు సంపత్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కోశాధికారి జి సతీష్, జాయింట్ సెక్రటరీ    ఎచ్ సంపత్, ఎస్ శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు జన్నారం శ్రీనివాస్, ఎలుగెటి శ్రీనివాస్, కంకణాల రఘు, రేగుల నర్సింగం కే విజయశంకర్, బి సదానందం, ఎస్ శేఖర్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వీడియో జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.