calender_icon.png 9 August, 2025 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాఖీ ఆకారంలో పంచతంత్ర పాఠశాల విద్యార్థులు

09-08-2025 01:47:37 AM

చేర్యాల, ఆగస్టు 8 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో శుక్రవారం రాఖీ పండుగను పురస్కరించుకొని పంచతంత్ర పాఠశాలలో సంబరాలు జరిపారు. రాఖి అక్షరాల రాఖి రూపంలో విద్యార్థులు కూర్చొని పండగ ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాల ప్రిన్సిపల్ శ్యామల ఉపాధ్యాయులు చంద్రిక రమాదేవి లు విద్యార్థులకు పండగ విశిష్టతను వివరించారు. పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సాయితేజ, మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ లకు విద్యార్థులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు చిన్నారులను అభినందించారు.