09-08-2025 01:49:38 AM
గజ్వేల్, ఆగస్టు 8 : భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ర్ట శాఖ పిలుపుమేరకు గజ్వేల్ పట్టణంలో బిజెపి శ్రేణులు శుక్రవారం గజ్వేల్ లో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. బిజెపి పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలివేరి కుంకుమ రాణి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కట్టా భాగ్య లక్ష్మి గజ్వేల్ పోలీస్ స్టేషన్లో, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సీఐ, పోలీస్ ట్రాఫిక్ పోలీసులకు అధికారులందరికీ మీకు మేము రక్ష మాకు మీరు రక్ష అంటూ రాఖీలు కట్టారు.
ఈ సందర్భంగా బిజెపి నాయకులు సీఐ రవికుమార్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు చేప్యాల వెంకట్ రెడ్డి , గజ్వేల్ పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి నాయిని సందీప్ కుమార్, బిజెపి నాయకులు మంద వెంకట్, కాశమైన సందీప్ కుమార్, హరి కుమార్ పట్టణ ఉపాధ్యక్షురాలు చేన్నోజి నీరజ, బిజెపి మహిళా నాయకురాలు స్వరాజ్యలక్ష్మి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.