27-05-2025 12:11:45 AM
కరీంనగర్, మే 26 (విజయ క్రాంతి):జిల్లాలో సుమారు 3000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సా గు చేయడమే లక్ష్యంగా రైతులకు అవగాహన కల్పించేందుకు ఊరు రా ప్రచారం చేసేందుకు వా హనాలను అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ సోమవారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని అన్నారు.
మూడేళ్ల పాటు కష్టపడితే 30 సంవత్సరాల పాటు రైతులకు నికర ఆదాయం వస్తుందని అన్నారు. ప్రభుత్వం తరఫున ఈ సాగుకు సబ్సిడీ కూడా ఉందని తెలిపారు. లోహియా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై జిల్లాలో నెలరోజుల పాటు విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలి పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాసరావు, ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ సంస్థ నిర్వాహకులు ప్రతిక్ పట్నాయక్, తదితరులుపాల్గొన్నారు