26-08-2025 12:42:40 AM
అనుష్క శెట్టి నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఘాటి’. విక్రమ్‌ప్రభు మేల్ లీడ్‌గా నటించిన ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రాజీవ్‌రెడ్డి విలేకరలతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
* ఒక ఫిమేల్ సూపర్ స్టా ర్‌తో కమర్షియల్ యాక్ష న్ మూవీ చేయాలనేది మెయిన్ ఐడియా. కర్త వ్యం తర్వాత ఆ స్కేల్లో మళ్లీ సినిమా రాలేదు. ఇప్పుడున్న స్టార్స్‌లో అ నుష్కకు అలాంటి స్టార్‌డమ్ ఉంది. క్రిష్ ఒక ప్రాజెక్టును అనుష్కతో చేయాలనుకున్నప్పుడు ‘ఘాటి’ ప్రారంభమైంది.
* అరకు, గాంజా బ్యాక్‌డ్రాప్‌లో కథ అనుకున్న తర్వాత సినిమానా? సిరీస్ చేయాలా అని ఆలోచించాం. అనుష్కతో సబ్జెక్ట్ అనుకున్నాం కాబట్టి సినిమానే మొదలుపెట్టాం. ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ.
* క్రిష్, అనుష్క కాంబోలో ‘వేదం’ హిట్. -ఆ అంచనాలను అందుకునేలా ‘ఘాటి’ ఉంటుందనే నమ్మ కం మాకుంది. ఇది పూర్తి యాక్ష న్ సినిమా. క్రిష్ మార్క్ డ్రామా ఉంటుంది. అనుష్క నటన మరోస్థాయిలో ఉంటుంది. ఈ కథకు పార్ట్ 2 చేసే స్కోప్ ఉంది. ఈ సినిమాకు ప్రేక్షకాదరణను బట్టి పార్ట్ 2 గురించి ఆలోచిస్తాం.
* ఒడిశాలో ఒక బార్డర్ ఏరియాలో షూట్ చేశాం. షూట్‌కి వెళ్లేటప్పుడు వేలా ది జనం అనుష్క చూడటానికి వచ్చేవారు. ఆ జనాన్ని నియంత్రించడానికి రెండు మూడుసార్లు లాఠీచార్జ్ కూడా అయింది. అనుష్కకు దేశవ్యాప్తంగా ఆ స్థాయి ప్రేక్షకాదరణ ఉంది.
* ‘ఘాటి’ రిలీజ్ తర్వాత మా నుంచి రాబోయే ప్రాజెక్టులను ప్రకటిస్తాం. వరుణ్ తేజ్‌తో చేస్తున్న సినిమా దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయింది. అది చాలా మంచి హారర్ కామెడీ ఎంటర్‌టైనర్. ‘-అరేబియన్ కడలి సీజన్ 2’ స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. అమెజాన్‌కు ఒక ఒరిజినల్ ఫిలిం చేయబోతున్నాం. ఇంకొన్ని స్క్రిప్స్ సిద్ధంగా ఉన్నాయి.