26-08-2025 12:44:45 AM
హీరో నారా రోహిత్ మైల్‌స్టోన్ 20వ చిత్రం ‘సుందరకాండ’. ఈ సినిమాను నూతన దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (ఎస్‌పీపీ) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్‌రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మిస్తున్నారు. వృతి వాఘాని, శ్రీదేవి విజయ్‌కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయకుడు నారా రోహిత్ విలేకరులతో సినిమా విశేషాలతోపాటు తన కెరీర్ గురించి పలు వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
* చాలా కాలం తర్వాత ప్రేక్షకులు నన్ను ఇటీవలి ‘భైరవం’లో చూశారు. -నిజానికి కమ్‌బ్యాక్ ‘సుందరకాండ’తోనే చేయాలి. 2022లోనే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించాం. డైరెక్టర్ వెంకటేశ్ ఈ ఐడియా చెప్పినప్పుడు కంగారు పడ్డాను. అదే సమయంలో వచ్చిన ‘బ్రో డాడీ’ సినిమా ఒక విండో ఓపెన్ చేసింది. ఆ స్టైల్‌లో చేస్తే వర్క్ అవుతుందనిపించింది. వెంకటేశ్ ఒక 30 సన్నివేశాలు రాసుకుకొచ్చాడు. నాకు చాలా నచ్చాయి.. ప్రాజెక్ట్ ప్రారంభించాం.
* ఈ తరానికిది చాలా కొత్త కథ. క్యారెక్టర్‌లో కొత్త ఎగ్జిట్ ఉంది. సినిమా ఎలా ఉండబోతుందో నాకు మొదట్నుంచీ క్లారిటీ ఉంది. క్యారెక్టర్‌ను చాలా ఎంజాయ్ చేశాను. క్యారెక్టర్ ఆర్క్‌లో ఉండి చేయడమనేది కచ్చితంగా చాలా సవాలుతో కూడుకున్నది. ఇందులో నా పాత్రకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కాంప్లికేటెడ్ క్యారెక్టర్. ఆ కాంప్లికేషన్ నుంచే వినోదం పుట్టుకొస్తుంది.
* ఈ చిత్ర దర్శకుడు వెంకటేశ్‌తోనే మరో సినిమా చేస్తున్నా ను. దీనికి ముందే ఒక కథ రాసుకున్నాం. కచ్చితంగా చే యాలి. అది కూడా ఒక మం చి లవ్‌స్టోరీ. -నాకు రొమాంటిక్ కామెడీలు, స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టం. మంచి స్పోర్ట్స్ డ్రామా, ఇన్స్‌పిరేషనల్ క్యారెక్టర్ వస్తే కచ్చితంగా చేస్తాను.