calender_icon.png 7 May, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుస్నాబాద్‌లో ఎన్ని ఇండ్లు కట్టిండ్రో చెప్పాలె?

07-05-2025 12:46:14 AM

బీఆర్‌ఎస్‌ను ప్రశ్నించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, మే 6 : గత బీఆర్‌ఎస్ ప్ర భుత్వం పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో డబుల్ బె డ్ రూం ఇండ్ల పథకం పూర్తిగా విఫలమైందన్నారు. మంగళవారం ఆయన మీడియాకు పంపిన వీడియోలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ చేయలేని పనులను కాంగ్రెస్ చేసి చూపిస్తోందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ కత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి న డుం బిగించిందన్నారు. మొదటి ఏడాదిలో నే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిర మ్మ ఇండ్లను మంజూరు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. హుస్నాబాద్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి దారుల ఎంపిక పారదర్శకంగా, ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేకుండా జరుగుతోందన్నారు.

నిజమైన నిరుపేదలకు మాత్ర మే ఇండ్లు అందజేస్తామని, ఈ ప్రక్రియలో అవినీతికి ఏమాత్రం అవకాశం ఉండదని ఆయన హామీ ఇచ్చారు. ఎంపిక చేసిన లబ్ధిదా టరుల జాబితాలను గ్రామాల్లో ప్రదర్శిస్తామని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అక్క డే తెలియజేయవచ్చన్నారు. ఒకవేళ అనర్హులకు ఇండ్లు కేటాయించినట్లు తేలితే కఠిన చ ర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయని, రెండ వ ఏడాదికి సంబంధించి మరో 3500 ఇం డ్లను మంజూరు చేస్తున్నామని, రాబోయే రెండు నెలల్లో రెండవ విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని చె ప్పారు.

డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వడం లో పూర్తిగా విఫలమైన బీఆర్‌ఎస్ నాయకులకు ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. హుస్నాబాద్ ని యోజకవర్గానికి కనీసం 200 డబుల్ బెడ్ రూం ఇండ్లు కూడా ఇవ్వని వారు ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 35 00 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తోందన్నారు.