calender_icon.png 7 May, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామ ప్రాజెక్టుకు కాలువలు ఏర్పాటు చేయాలి

07-05-2025 01:00:33 AM

లేదంటే ఉద్యమం తప్పదు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని హెచ్చరిక 

భద్రాద్రి కొత్తగూడెం, మే6 (విజయక్రాంతి): జిల్లాలో ఏర్పాటు చేసిన సీతారామ ప్రాజెక్టుకు డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కు నిధులు కేటాయించి నిర్మాణం చేపట్టాలని లేదంటే జిల్లా వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టాల్సి ఉంటుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మంగళవారం పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలోని ముంతాజ్ ఫంక్షన్ హాల్ లో ఎలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన జిల్లా వర్క్ షాప్ లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రూ 19 కోట్లతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూముల నుంచి కాలువలు తీసినా, జిల్లాకి నీరు ఇవ్వటాని కి కావలసిన డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ నిర్మాణం చేపట్టకపోవడంతో జిల్లాలో వ్యవసాయ భూములు ఎండిపోయే అవకాశం ఉందన్నారు.

జిల్లా నుండి నీరు పోతున్న జిల్లాకు చుక్క సాగునీరు లేకపోతే జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోవాలా అని ఆయన  ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లాకి అ న్యాయం జరుగుతుంటే తెలంగాణ రైతు సంఘం చూస్తూ ఊరుకోదని దీనిపై ఈ నెల 20వ తేదీ వరకు గ్రామ గ్రామాన సభలు పెట్టి ప్రజలను చైతన్యం చేస్తామని, ఈ నెల 30వ తేదీ వరకు మండల స్థాయి ధర్నాలు నిర్వహించి అనంతరం జాతాలు నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం దిగ్భందిస్తామని ఆయన  హెచ్చరించారు.

ఈ జిల్లా లో ప్రాజెక్టుకి భూములు ఇచ్చిన మిగిలిన భూములు కి సబ్ కాలువలు ఏర్పాటు చేసి జిల్లాలో మొదటి డిజైన్ ప్రకారం మూడున్నర లక్షలు ఎకరాలకు సాగునీరు అవసరం ఉందన్నారు.  ప్రభుత్వం డిజైన్ మార్చి 2 లక్షల  కుదించిందని, ఆ రెండు లక్షల కూడా నేడు నీళ్లు వచ్చే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నవరపు కనకయ్య రై తు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ,నాయకులు కొనసా ధర్మ దొడ్డ లక్ష్మీనారాయణ, కొండ పోయిన వెంకటేశ్వర్లు, రవికుమార్, సత్యనారాయణ ,కేశవరావు తిరుపతి రావు, శ్రీకాంత్, శంకర్ వెంకటేశ్వర్లు, వినోద్ శ్రీనివాసరావు, వెంకట్రావు, రామారావు, శంకరయ్య, సమ్మక్క, తదితరులు పాల్గొన్నారు.