06-12-2025 12:00:00 AM
సిర్గాపూర్, డిసెంబర్ 5: సిర్గాపూర్ మండల కేంద్రంలోనీ రైతు వేదికలో, ఎంపీడీవో ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కౌంటర్లో నామినేషన్ ప్రక్రియలు నామినేషన్ వేయడానికి వచ్చిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు మధ్యాహ్నం తర్వాత ఒకేసారి రావడంతో ఉద్రిక్తత వాతావర ణం నెలకొంది. అక్కడికి ఎస్‌ఐ మహేష్ చేరుకొని అభ్యర్థులను జిపిల ద్వారా తీసుకొని టోకెన్ ఇచ్చి అందరిని నామినేషన్ తీసుకుంటా మని అభ్యర్థులందరూ సమన్వయం పాటించాలని చెప్పడం జరిగింది. అక్కడికి తహసీల్దార్ కిరణ్ కుమార్, డిప్యూటీ తాసిల్దార్ హేమంత్, ఎంపీడీవో శారదా దేవి చేరుకొని నామినేషన్ కి వచ్చిన అభ్యర్థులందరినీ నామినేషన్ వేయిస్తామని భరోసా ఇవ్వటం జరిగింది. సీఐ వెంకట్ రెడ్డి తోపులాటను సరిదిద్ది నామినేషన్లు వేసేలా చేశారు.