calender_icon.png 13 December, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి

11-12-2025 01:13:46 AM

ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా బేగం

కొల్చారం,డిసెంబర్ 10 (విజయక్రాంతి) ః కొల్చారం మండల వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలని ఎంపీడీవో రఫిక్ ఉన్నిస బేగం సూచించారు.

కొల్చారం మండల కేంద్రం లో బుధవారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. నిబంధన లకు విరుద్ధంగా ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.