calender_icon.png 13 December, 2025 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేయాలి

11-12-2025 01:12:39 AM

  1. వేతనాలు ప్రధాన ఖాతా (010) ద్వారా చెల్లించాలి 

గజ్వేల్ జిల్లా ఆసుపత్రి ఉద్యోగుల ఏకగ్రీవ డిమాండ్

గజ్వేల్, డిసెంబర్ 10 : వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల వేతనాలను 010 అకౌంట్ ద్వారా చెల్లించాలని, వైద్య విధాన పరిషత్ రద్దు చేసి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటు సంబంధించిన ప్రక్రియని త్వరగా పూర్తిచేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుధవారం జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అన్నపూర్ణ కు ఆసుపత్రి సిబ్బంది సామూహిక సంతకాలతో వినతి పత్రం అందజేశారు.

ఈ సంద ర్భంగా ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన ఖాతా ద్వారా వేతనాలు చెల్లించడం వల్ల వేతనాల చెల్లింపులో పారదర్శకత, ఉద్యోగ భద్రత, సేవానిబంధనల్లో స్పష్టత లభిస్తుందని సిబ్బంది వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంఓలు, వైద్యులు, నర్సింగ్ అధికారులు, పారా వైద్య సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.