calender_icon.png 24 October, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరవీరులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ

24-10-2025 12:07:29 AM

చేగుంట, అక్టోబర్ 23 : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం రాత్రి చేగుంట ఎస్.ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు పోలీస్ అమర వీరుల మృతికి సంతాపంగా కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్బంగా ఎస్ ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితులైనా తట్టుకొని ప్రజలకు రక్షణ కల్పించేది పోలీసులే అని, దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. అందుకే వారి సేవలు అమూల్యమని అన్నారు.  వడ్ల నవీన్ కుమార్, అయిత పరంజ్యోతి, కరణం గణేష్, ఎర్రం రవీందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.