27-10-2025 01:55:10 AM
-లాడ్జిలో విక్రయిస్తున్న ఎనిమిది మంది అరెస్ట్
-735 గ్రాముల గంజాయి స్వాధీనం
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలో గంజాయి బహిరంగ విక్రయాలు తీవ్ర కలకలం సృష్టించింది. పట్టణ నడిబొడ్డున ఉన్న ఓ లాడ్జిలో ఎండు గంజాయి విక్రయిస్తున్నారన్న ఖచ్చితమైన సమాచారంతో ఆదివారం పోలీసు లు దాడులు జరిపారు. ఈ దాడిలో నలుగురు విక్రయదారులతోపాటు మరో నలు గురు వినియోగదారులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి 735 గ్రా ముల ఎండు గంజాయితోపాటు ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. దూల్‌పేట ప్రాంతానికి చెందిన ఆకాష్‌సింగ్ అనే వ్యక్తి నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి కాలనీకి చెందిన బొందల రేణుకుమార్, ఈశ్వర్ కాలనీకి చెందిన మైలగాని సందీప్, రాఘవేంద్ర కాలనీకి చెందిన అరకువిశ్వాస్ (వీరంతా 25 ఏళ్ల యువకులే) సుమారు కిలో బరువు గల ఎండు గంజాయిని కొనుగోలు చేశారు.
ఆ గంజాయిని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన కొత్త వెంకటేష్, హరిజనవాడ కాలనీకి చెందిన కొత్త మనోజ్ కుమా ర్, తాడూరు మండలం గుంతకోడూరు గ్రా మానికి చెందిన ఉడతల ఆది కృష్ణగౌడ్, అదే గ్రామానికి చెందిన గుల్ల పరమేష్ అనే నలుగురు (25ఏళ్ల లోపు యువకులు) కొన్నారు. ఈ క్రమంలో ఖచ్చితమైన సమాచారం అం దడంతో జిల్లా కేంద్రంలోని చైత న్య లాడ్జిలో పోలీసులు దాడులు జరిపి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టు ముం దు హాజరు పరిచిన అనంతరం సమగ్ర దర్యాప్తు కోసం కోర్టు అనుమతి తీసుకుని మరింత లోతుగా దర్యాప్తు జరపనున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.