27-10-2025 01:54:48 AM
హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారా న్ని అధికార కాంగ్రెస్ మరింత రక్తి కట్టించనుంది. జూబ్లీహిల్స్‌ను హస్తగతం చేసుకునేం దుకు పగడ్బందీగా ప్లాన్ చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యక్షంగా రంగంలోకి దిగనున్నారు.
ఈ నెల 30 నుంచి నాలుగు రోజుల పాటు రోడోషోలు నిర్వహించేలా అధికారపార్టీ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో అధిక సంఖ్యలో ఉన్న సినీకార్మికులతో భారీసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 28న పోలీస్ గ్రౌండ్స్‌లో సభకు శ్రీకారం చుట్టింది. ఈ మీటింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
సినీరంగ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేలా గతంలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్మాతలు, సినీ ప్రముఖులను కూర్చో బెట్టి ఒప్పించారు. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని బహిరంగ సభ ద్వారా వారికి విజ్ఞప్తి చేయనున్నారు. సినీ కార్మికులు, ఆ నేపథ్యం కలిగిన వారి ఓట్లు ఈనియోజకవర్గంలో పది వేలకు పైగానే ఉంటాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో వారితో సభ నిర్వహించడం ద్వారా భారీ మెజార్టీ సాధించవచ్చని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.
అన్ని డివిజన్లలో రోడ్ షోలు
ఈ నెల 30 నుంచి నాలుగు రోజుల పాటు జూబ్లీహిల్స్‌లోని అన్ని డివిజన్లలో సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఈ నెల 30, 31న, వచ్చే నెల 4, 5వ తేదీల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. సాయంత్రం వేళ రోడ్‌షోలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో డివిజన్‌లో ఒకటి రెండుచోట్ల ఆయన ప్రసంగించనున్నారు.
అందుకోసం మంత్రులు భారీ ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నాలుగు రోజులే కాకుండా అవసరమైతే మరో రోజు సైతం సీఎం రేవంత్‌రెడ్డి రోడ్ షో నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సీఎం ప్రచారం ప్రారంభమైతే ప్రచారం మరింత వేగం పుంజుకుంటుందని, బాధ్యతలు అప్పగించిన మంత్రు లు, ఎమ్మెల్యేలు మరింత సీరియస్‌గా పనిచేస్తారని భావిస్తున్నారు.
ఇద్దరు మం త్రులకు ఒక డివిజన్ చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఒక్కోమంత్రికి నలు గురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్, పొన్నం ప్రభాకర్, సీతక్క విస్తృతంగా పర్యటిస్తున్నారు.