27-10-2025 01:56:29 AM
-డీఈవోల సమావేశంలో డైరెక్టర్ నవీన్ నికోలస్
-అత్యధిక హాజరు శాతం నమోదులో ఖమ్మం జిల్లా
హైదరాబాదా, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో అమలవు తు న్న ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) హాజరు విధానంతో సత్ఫలితాలు వస్తు న్నాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసినందకు అన్ని డీఈఓలను అభినందించారు. అతితక్కువ సమయంలోరిజిస్ట్రేషన్ పూర్తి చేయడంతోపాటు హాజరు శాతం లో మెరుగైన ప్రగతిని సాధిస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్ డీలో శనివారం డీఈవోలు, డైట్ ప్రిన్సిపాల్స్‌కు యాప్స్, డిజిటల్ ఇంటర్వెన్షన్‌పై అవ గాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు అధికారులు ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. మెరుగైన హాజరు శాతాన్ని నమోదు చేసిన వారిని జిల్లా, మండలం, పాఠశాల స్థాయిల వారీగా డైరెక్టర్ నవీన్ నికోలస్ గుర్తించి, శాలువాతో సత్కరించి, ప్రశంసాపత్రాలను అందజేశారు.
అత్యధిక సగటు హాజరు శాతం నమోదు చేసిన ఖమ్మం జిల్లా విద్యాధికారి డాక్టరు పి శ్రీజ, మండల విద్యాధికారి ఎస్ రామారావు, నిజాంబాద్ జిల్లాలోని భీంగల్ మండలంలోని బెజ్జోర పాఠశాల హెచ్‌ఎం హఫీజు ద్దీన్‌తోపాటుమరి కొంతమంది అధికారులు, హెచ్‌ఎంలనుఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్లు రాధారెడ్డి, లింగయ్య, రమణ కుమర్, శ్రీనివాస చారి, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ జి రమేష్, జాయింట్ డైరెక్టర్స్ పి రాజీవ్, వెంకట నరసమ్మ, మదన్మోహన్, ఆర్జేడీలు పాల్గొన్నారు.