24-06-2025 12:00:00 AM
ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు ఉ న్నత భవిష్యత్తు అందించేందుకు తపన పడుతుంటారు. ఎంత కష్టమైనా, ఖర్చయినా నాణ్యమైన విద్యను అందించాలనే కోరుకుంటారు. వారి ఆరాటాన్ని సొ మ్ము చేసుకుంటున్నాయి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు. రాష్ట్రంలో తల్లిదండ్రు లు, తమ పిల్లలకు విద్యను చదివిపిద్దామ ని పోతే అక్కడ చదువు‘కొనాల్సి’ వస్తుం దని వాపోతున్నారు.
ప్రైవేట్ విద్యాసంస్థ లు చాలావరకు కాన్వెంట్స్, కార్పొరేట్స్ ఫక్తు ‘కలెక్షన్ సెంటర్స్’గా మారాయి. ప్రైవే ట్ విద్యాసంస్థలు దోపిడీ కేంద్రాలుగా, విద్య అక్షరాలతో లక్షల రూపాయల వ్యా పారం చేస్తున్నాయి. విద్యార్థులు, వారి తల్లితండ్రుల వద్ద నుంచి వేలు, లక్షల రూపా యలు దోచుకునే ముఠా సంస్థలుగా త యారైనట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ‘చదువు చారెడు బలపాలు దోసెడు’ అనే సా మెత నేడు ప్రైవేట్ విద్యాసంస్థలను చూస్తే గుర్తుకు రావలసిందే.
విద్యా సంవత్సరం లో ఇప్పటికే జూనియర్ కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో కేజీ నుంచి బీటెక్ వరకు వసూలు చేస్తున్న ఫీజులు చూస్తే భయపడాల్సిన పరిస్థితు లు. తల్లిదండ్రుల ఈ ఆరోపణలు అధికారులకు వినిపించవు. ప్రత్యక్షంగా చూపిం చినా సరైన చర్యలు ఉండవు. కారణం, వారికి ఆయా సంస్థల నుంచి ఆ స్థాయిలో కమిషన్లు, మర్యాదలు అందుతుంటాయని విమర్శలు వస్తున్నాయి.
ఫీజులు ఘనం, సౌకర్యాలు శూన్యం
రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల దోపిడీ ఏ ఏటికా ఏడు పెరుగుతున్నది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఫీజుల రూపంలో డబ్బును దోపిడీ చేయడానికే అనేక కార్పొరేట్ విద్యాసంస్థలు సిద్ధమవుతాయి. ‘నో అడ్మిషన్’ అంటూనే మరోవైపు నుంచి అడ్మిషన్లు తీసుకుంటుంటారు.
పాఠశాల ల్లో అడ్మిషన్ పొందాలంటే అడ్మిషన్ ఫీజు ను చూసే భయపడాల్సిందే. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి ప్రవేశ పరీక్ష రాయాలి. అందులో పాస్ అయితేనే పాఠశాలలో అడ్మిషన్ అంటారు. తర్వాత అడ్మిషన్ ఫీజు రాష్ట్రంలో చిన్న పాఠశాల రూ. 500 నుంచి మొదలుకొని కార్పొరేట్ స్థాయిల్లో రూ. 20,000 వరకు వసూళ్లు చేస్తున్నారు. ట్యూషన్ ఫీజు వేరు, హాస్టల్ ఫీజు వేరు.
ఈ ఫీజులు ప్రతీ సంవత్సరం 20 నుంచి 30 శాతం వరకూ పెంచుతున్నారని కూడా తల్లిదండ్రుల నుంచి ఫిర్యా దులు అందుతుంటాయి. చిన్న జిల్లా కేం ద్రాల్లో నర్సరీకి రూ. 30 వేలు ఉంటే హైదరాబాద్ మహానగరంలో లక్షా 50 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు.
జిల్లాల్లో కొన్ని పాఠశాలల్లో 9, 10వ తరగతులకు రూ. 80 వేల నుంచి 2 లక్షల వరకు ఫీజులు ఉంటున్నాయి. హైదరాబాద్, రం గారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, హన్మకొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్న కార్పొరేట్ పాఠశాలల్లో 3 లక్షల నుంచి 6 లక్షల వర కూ ఫీజులు ఉన్న వైనం ఉంది.
యాజమాన్యాల ఇష్టారాజ్యం
ఫీజులు భారీగా ఉన్నా సౌకర్యాలు మాత్రం సున్నానే. విద్యార్థులకు ఆడుకోవడానికి చాలినంతగా ఆటస్థలాలు ఉండవు. మౌలిక వసతులు శూన్యం. ఇండ్ల లాంటి భవనాల్లో తరగతుల నిర్వహణ, పైగా మం చి ఉపాధ్యాయ బృందం అంటూ నమ్మిం చే ప్రకటనలు, ప్రచారం చేస్తారు. కానీ, పాఠశాలకు ప్రభుత్వ అనుమతి ఉందా లేదా అన్నది మాత్రం చెప్పరు. ఒకవేళ అనుమతి ఉన్నా అనుమతి పత్రాలు ఒక భవనం మీద ఉంటే, తరగతుల నిర్వహణ మరొక చోట జరుపుతారు.
విద్యాశాఖ అధికారులు జరిపే తనిఖీలు నామమాత్రమే. ‘అంతా ఒకే’ అంటూ అనుమ తులు ఇచ్చేస్తారు. కానీ, ఫీజుల వివరాలు అడుగరు. మౌలిక వసతులు పట్టించుకోరు. టీచింగ్ సిబ్బంది విద్యార్హతల వివరాలపై కన్నెత్తి అయినా చూడరు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ ఇష్టాను సారంగా ఫీజులు పెంచుతారు. కానీ, ఆ స్థాయిలో విద్యార్థులకు సౌకర్యాలు మా త్రం కల్పించారు.
టీచింగ్ సిబ్బందికి పెం చుతున్న ఫీజులకు అనుగుణంగా సిబ్బంది వేతనాలు పెంచి ఇవ్వరు. తరగతి గదులలోనే బుక్ స్టాల్స్ ఏర్పరచి, అమ్మకాల కేంద్రాలుగా మారుస్తున్నారు.
రాష్ట్రంలో దాదాపు 13,000 వేల ప్రైవే ట్, కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలో 20 లక్షలకుపైగా పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు పుస్తకాలు, యూనిఫా మ్స్, స్టడీ మెటీరియల్ అమ్మకాల కేంద్రాలుగా మారాయంటే అతిశయోక్తికాదు. అడ్మిషన్లు తీసుకోగానే పుస్తకాలు, యూనిఫామ్స్ కొనుక్కోవాలని, అవి తమ వద్దే కొనాలని షరతులు పెడతారు.
బయట నుంచే తెచ్చేవాటిని అనుమతించబోమని హుకుం జారీ చేస్తున్నారు. పాఠశాలల్లో తరగతి గదులలో పుస్తకాలు, యూనిఫామ్స్, టై, బెల్ట్, షూ అమ్ముతూ సూపర్ మార్కెట్లవలె పాఠశాలలను మారుస్తున్నా అధికారులు పట్టించుకోరు. హైస్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు ఉపయోగించనున్న నేపథ్యంలో వారిని స్టడీ మెటీరియల్ పాఠశాలల్లోనే కొనాలని ఆదేశాలిస్తున్నారు.
సీఎం ప్రత్యేక దృష్టి పెట్టాలి!
ఈ రకంగా తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారు. ముఖ్యంగా ప్రైమరీ పాఠశాల విద్యార్థుల పుస్తకాలు ఒకటి నుంచి అయిదవ తరగతి వరకు ప్ర భుత్వ పుస్తకాలు కాకపోవడంతో యాజమాన్యాలు ఈ ప్రైమరీ పుస్తకాల పేరుతోనే ఎక్కువగా దోచుకుంటూ, సిరీస్‌ల పేరుతో ఆ కంపెనీలతో కుమ్మక్కవుతున్నట్టు బలం గా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పాఠశాలల్లో అమ్మే సీరిస్ బుక్‌లను పక్క పాఠ శాలల్లో అమ్మకుండా యాజమాన్యాలు సిండికేట్ అవుతున్నారు.
ప్రతి పుస్తకంపై పాఠశాల పేర్లు ఉంటాయి. మరి పాఠశాల ఆవరణలోనే అమ్ముతున్నా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. బయటకొంటే డిస్కౌంట్ ఉంటుంది. కానీ పాఠశాల వారివద్ద కొంటే అధిక శాతం రేటు. కొనే పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ వస్తువులపై బిల్లులు కూడా ఇవ్వరు.
ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో స్టడీ మెటీరియల్ యూనిఫామ్స్ పే రుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. యూనిఫామ్ ఫీజు వారికే ఇచ్చి యూనిఫా మ్ కొలతలు కూడా కళాశాల ఆవరణ లో నే ఇవ్వాలి. కళాశాల వారు యూనిఫామ్స్ పేరుతో పది నుంచి పదిహేను వేల వరకు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రై వేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాల్సిన అవరసరం ఎంతైనా ఉంది.
విద్యాశాఖ కూ డా సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న నేపథ్యం లో రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు అరికట్టే బాధ్యతను ఆయనే తీసుకోవాలి. ప్రతి ప్రైవేట్ విద్యాసంస్థ నిబంధనలు పాటించేలా, రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉం డేలా కామన్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఫీజుల నియంత్రణ చట్టం, విద్యా హక్కు చట్టం కఠినంగా అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
వ్యాసకర్త సెల్: 7569548477