calender_icon.png 15 September, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విముక్తి పోరాటాలకు చివరిరోజులా?

24-06-2025 12:00:00 AM

నిత్యం దండకారణ్యం బుల్లెట్ల చ ప్పుళ్లతో దద్దరిల్లుతున్నది. మావోయిస్టులకు పోలీసులకు మధ్య కొన్ని రోజు లుగా తుపాకుల మోత మోగుతున్నది. మొన్న మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి (చీఫ్) సంబాల కేశవరావు, నిన్న చర్చ ల ప్రతినిధి చలం  సుధాకర్, నేడు మరో ప్రతినిధి ఏవోబీ, ఆంధ్ర కార్యదర్శి గాజర్ల రవి గణేష్ అశువులు బాశారు.

2024 అ క్టోబర్ 7న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టుల కార్యకలాపా లు ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గడ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రెటరీలు, డీజీపీలతో జరిగిన సమావేశ సారాంశంలో భాగంగా 31 మార్చి 2026 లోపు తీవ్రవాదులను ఏరి వేయాలని ఆపరేషన్లను ముమ్మరం చేశారు. 

మునుపెన్నడూ లేని విధంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో నాడు సల్వా జుడుం వలె సాయుధ బలగాలకు బ్యాక్ బోన్‌గా డీఆర్‌జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) కీలక భూమిక పోషించి, భారత ప్రభుత్వం వామపక్ష తీవ్రవాద రహితమే లక్ష్యంగా పని చేస్తున్నది. మావోయిస్టుల కంచుకోటను ఛేదించింది. నాడు 2009లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నక్సలిజాన్ని అత్యంత తీవ్రమైన  అంతర్గత భద్రతా ముప్పుగా అ భివర్ణించారు.

అయితే మావోయిస్టులు డ్రోన్లను ఉపయోగిస్తూ సీఆర్పీఎఫ్ బలగాల సమాచారం తెలుసుకొని దాడులు చేస్తున్నారని ప్రభుత్వం అప్రమత్తమైంది. అందుకే ఆచూకీ కనుగొనేందుకు ప్రభావిత ప్రాంతాల్లో సులువైన ప్రయాణం కో సం 14,400 కి.మీ. పొడవున రోడ్లతోపాటు మావోయిస్టులు వాడుతున్న సాంకే తికతను విచ్ఛిన్నం చేసేందుకు అడుగడుగునా  మొబైల్ టవర్లు నిర్మించింది. ఆపరే షన్ కగార్ ఆపాలని, శాంతి చర్చలు జరపాలని ప్రజాస్వామ్య వాదులు రోడ్డు ఎ క్కారు.

నాడు మావోయిస్టు పార్టీ బలంగా విస్తరించినప్పుడు జరిగిన చర్చల్లో పాల్గొ న్న రియాజ్, రామకృష్ణ, చలం, గాజర్ల రవి ఏ ఒక్కరు మిగలలేదు. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే దాడి చేయాలనే వ్యూ హం బలంగా కన్పిస్తున్నది. అందుకే మా వోయిస్టులు శాంతిచర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం సిద్ధంగా లేదనేది స్పష్టమ వుతున్నది.

‘ఆపరేషన్ కగార్’ ద్వారా 17 నెలల్లో 540 మంది మావోయిస్టులు, సా మాన్య ఆదివాసీలు, పోలీసుల మరణాలు నమోదైనాయి. ఈ మధ్యకాలంలో అయితే మరింత భారీ నష్టం జరగడానికి దంతెవా డ కేంద్రంగా డీఆర్‌జీలో మాజీ నక్సల్స్, కోవర్టులు, స్థానిక యువతతో మహిళా కమెండోలను ఏర్పాటు చేసుకొన్నారు. ఇలా ప్రతి ఆపరేషన్ సక్సెస్ అవుతున్నది.

సామ్యవాద స్ఫూర్తికి అంతరాయం  

సోషలిస్ట్ రాజకీయ స్ఫూర్తి తగ్గితే బూ ర్జువా రాజకీయ చైతన్యం పెరుగుతుంది. బూర్జువా ధోరణి తగ్గితేనే సోషలిస్ట్ చైత న్యం పెరుగుతుంది. ఒక బూర్జువా పార్టీని కాదని మరొక పార్టీని ఎత్తిపట్టడం సోషలిస్ట్ రాజకీయ చైతన్యం అనిపించుకోదు. అది బూర్జువా ధోరణియే అవుతుంది.

ఒక కమ్యూనిస్టు సంస్థ లేదా వ్యక్తి వేర్వేరు కారణాలతో తాత్కాలిక ప్రయోజనాల కోసం సోషలిస్టు చైతన్యాన్ని నిర్లక్ష్యం చేసి, బూ ర్జువా ప్రేరణ ప్రాతిపదికగా పనిచేయడం అంటే సదరు రాజ్యాధికారాన్ని మరింతగా స్థిరపరచడమే అవుతుంది.

నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ ప్రభుత్వాలు మావోయిస్టుల కీలక నాయకులను, కార్యకర్తలను మట్టుబెట్టి, అరెస్టు చేయడంలో థండర్ బోల్డ్ దళాలు, సీఆర్పీఎఫ్, గ్రేహాండ్స్, ఎస్టీఎఫ్ బలగాలు, ఇన్ఫార్మర్ వ్యవస్థ అన్నింటినీ పటిష్టం చేసుకొని విజయం సాధించారు. 

‘2003లో చంద్రబాబుపై క్లైమోర్ మై న్స్‌తో దాడి, దండకారణ్యంలో భాగమైన ఛత్తీస్‌గడ్‌లో 2010లో చింతల్‌నార్ ఆదివాసీ గ్రామం వద్ద మావోయిస్టులు జరిపి న మెరుపు దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి సూత్రధారి సంబాల కేశవరావే’ అనే ప్రచారం జరిగింది. ఆ రోజుల్లో ఆ సంఘటన పెద్ద సంచలనం సృష్టించింది. తదుపరి దేశ వ్యాప్తంగా మావోయి స్టు సాయుధ దళాలకు శిక్షణ ఇచ్చే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కీలక నా యకుడు అరెస్ట్ కావడం, శత్రువు నీడను పసిగట్టే అధునాతన టెక్నాలజీ లేకపోవ డం, కర్రెగుట్టలో తల దాచుకున్న వేళ భారీనష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.

ఛత్తీస్‌గడ్ సీఎం మావోయిస్టులతో చర్చలకు సిద్ధం అని ప్రకటించారు. తమ డిమాండ్లు అంగీకరిస్తే తాము చర్చలకు సిద్ధమని ప్రకటిం చిన నెల రోజుల్లోనే పలు ఎన్‌కౌంటర్లలో ఎందరో నెలకొరిగారు. ఏ క్షణంలో ఎక్కడ తుపాకులు పేలుతాయోనని ఉక్కిరి బిక్కిరితో ఆదివాసీ బిడ్డలు గడుపుతున్నారు. వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయడానికి శాంతి చర్చల పేరుతో ముఖ్యమం త్రు లు వారి నిఘా వ్యవస్థలతో దారుణమైన ఘాతుకానికి ఒడిగట్టారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది.

మార్కి ్సజం అనే సి ద్ధాంతం చైతన్యంతో అర్థం చేసుకొని విప్లవాలను విజయవంతం చేయడానికి మార్గదర్శకత్వం చేస్తుంది. కానీ అలాంటి చైతన్యవంతమైన పాత్ర వహించకుండా, కా లం చెల్లిన పాత విధానాలనే పట్టుకొని మొండిగా కొనసాగడం, శాంతి చర్చలకు సిద్ధమై, శత్రువును గుర్తించక ఎదురెల్లడం వల్ల విప్లవానికి, ఉద్యమానికి తీవ్ర నష్టం జరిగిందనే అభిప్రాయం ప్రజాస్వామ్యవాదుల్లో వ్యక్తమవుతున్నది.    

సమస్యలతో ముడిపడిన కమ్యూనిజం

మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యులు, దండకారణ్య స్పె షల్ జోనల్ కమిటీ సభ్యులు ఎన్‌కౌంటర్ కావడం, అనేక ప్రాంతాల్లో  అరెస్టు కావ డం మరి కొందరు లొంగిపోవడం, ఆరో గ్యం సహకరించక మావోయిస్టు ఉద్యమం ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనుకకు అన్నట్టుగా సంకేతాలు స్ప ష్టంగా కన్పిస్తున్నాయి. తూర్పు కనుమల్లో స్థావరాలకు తీవ్ర నష్టం వాటిల్లినా, పశ్చి మ కనుముల్లో కొత్తగా నిర్మించుకుందామన్న వారి ఆశ మంత్రి అమిత్ షా దూకు డు నిర్ణయాలతో అడుగంటింది.

ఆపరేషన్ కగార్‌తో ఇంత రక్తపాతం అవసరమా? సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న సమాజాన్ని తుపాకీతో శాసించడం సాధ్యమేనా? మావోయిస్టు అగ్రనాయకులూ ఆలోచించాల్సిన తరుణమిది. శత్రువు బలంగా ఉన్నప్పుడు తన గెరిల్లా, మిలటరీ ప్లాటూన్లను సకారాత్మక పనులకు ఉపయోగించడమే సముచితంగా ఉంటుంది. ఎందుకంటే, 2010లో ఉన్న పరిస్థితి 2020లో లేదు.

కేంద్రం 2026 కల్లా మా వోయిస్టులు లేని భారతం నిర్మించాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నది. ఒక్క కేంద్రంపై నింద వేయడం కాదు, హైకోర్టు స్పందించిన చనిపోయిన నక్సల్స్ డెడ్ బాడీలు ఆయా రాష్ట్రాల్లో అడుగు పెట్టనివ్వలేదంటే కేంద్ర, రాష్ట్రాల సమాఖ్య స్ఫూ ర్తి ఏ విధంగా కొనసాగుతుందో కుటుంబసభ్యుల గుర్రును పట్టి అర్థమవుతున్నది. భూమి, భుక్తి, పేద ప్రజల విముక్తి కోసం పుట్టిందన్న ఈ పోరాటం వల్ల లక్షలాది ఎకరాల సాగుభూముల పంపకాలు జరిగాయి.

పోరాట ఉధృతి తగ్గినా తర్వాత ఆ భూములన్నీ మళ్ళీ భూస్వాముల చేతుల్లోకి పోయి, భూములకు రెక్కలొచ్చి బిలి యనీర్లుగా మారారు. ఈ పోరాటాలు స మాజంపై ఏ ప్రభావం కల్గించలేదా? 

అంటే, తప్పకుండా కల్గించాయి. 

మార్క్ ్స చెప్పిన ఫ్యూడల్, భూస్వామ్య వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థ తర్వాత సోషలిస్టు వ్యవస్థ వస్తుందన్న సూత్రానికి ఈ పెట్టుబడిదారుడే ప్రతిబంధకం అయ్యాడు. ఆదివాసీ ప్రాంతాల్లో అశాంతి రగులుతోం ది. పలమాపు నుంచి ఆదిలాబాద్ దాకా వారిలో నవ చైతన్యం వెల్లివిరుస్తున్నది. దాంతోపాటే వారివైపు నుంచి అనేక ప్రశ్న లు ఉత్పన్నమవుతున్నాయి.

‘సమస్యల నుంచి ఉద్భవించే కమ్యూనిజాన్ని ఎవరూ నిర్మూలించలేరు’ అనేది ఒక చారిత్రక స త్యం. కానీ, వాళ్ళు నాటిన జ్ఞాపకాలు చరిత్రలో పదిలంగా నీటి ఊటలవలె నిలిచి పోతాయనేది చారిత్రక సత్యం. ఆపరేషన్ కగార్ ఆపకపోయినా, శాంతి చర్చలకు ముందుకు రాకపోయినా, పోలీసులు డ్రో న్ల సాయంతో అడవిని జల్లెడ పట్టినా.. ఇక వచ్చేది వర్షాకాలం కనుక కేంద్రం లక్ష్యం అంత సులువుగా నెరవేరదనే అభిప్రా యం కూడా ప్రజల్లో నెలకొంది.  

వ్యాసకర్త సెల్: 9866255355