calender_icon.png 10 November, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం ఘాట్ రోడ్డులో కారులో మంటలు

10-11-2025 12:06:53 AM

అప్రమత్తమైన కుటుంబ సభ్యులు తప్పిన ప్రాణాపాయం

అచ్చంపేట నవంబర్ 09: శ్రీశైలం ఘాట్ రోడ్డులో కారులో అకస్మాత్తుగా మంటలు చెల్లారేగి కారు దగ్ధమైంది. వాహన యజమాని అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళితే హైద్రాబాదుకు చెందిన పవన్ కుమార్ తన 6 మంది కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లన్న దర్శనానికి కారులో వెళ్తున్నారు.

అచ్చంపేట నియోజకవర్గం ఈగలపెంట సమీపంలోకి చేరగానే టయోటా కారులోనీ ఇంజనులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారు యజమాని పవన్ కుమార్ కారున అక్కడే ఆపేసి కుటుంబ సభ్యులను కిందికి దించాడు. దీంతో వారంతా తృటిలో ప్రారంభం నుంచి తప్పించుకున్నారు. అప్పటికే మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలికి అగ్నిమాపక వాహనం చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.