calender_icon.png 10 November, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అద్భుతంగా అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం

10-11-2025 12:08:14 AM

-సగర సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రణీల్ చందర్ సగర

-స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలి: రాష్ర్ట అధ్యక్షుడు శేఖర్ సగర

మహబూబ్ నగర్, నవంబర్ 9 (విజయక్రాంతి): అద్భుతంగా అభివృద్ధి వైపు అడుగులు వేద్దామని సగర సంగం రాష్ర్ట అధ్యక్షుడు శేఖర్ సగర అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ ఏనుగొండ సగర భవనంలో రాష్ర్ట సగర సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశం అనంతరం జరిగిన ఎన్నికలలో జిల్లా సగర సంఘం అధ్యక్షులుగా జడ్చర్లకు చెందిన పాలకొండ సాయి ప్రణీల్ చందర్ సగర, ప్రధాన కార్యదర్శిగా దేవరకద్ర కు చెందిన గుంటి సత్యం సగర, కోశాధికారిగా మూసాపేటకు చెందిన మద్దిగట్ల నారాయణ సగర లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సగరులు నివాసమున్న ప్రతి గ్రామంలో పోటీ చేసి సత్తా చాటాలని తెలంగాణ సగర సంఘం రాష్ర్ట అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర పిలుపునిచ్చారు. జిల్లాలోని 8 మండలాలు 54 గ్రామాలలో ఉన్న సగరులను చైతన్యపరిచి భవిష్యత్తులో హక్కుల సాధన కోసం జిల్లా సంఘాన్ని మరింత పటిష్టవంతం చేస్తామని నూతనంగా రెండవసారి ఎన్నికైన పాలకొండ ప్రనిల్ చందర్ సగర అన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి సగరుని తట్టి ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ ఫలాలను సాధించడం కోసం, ప్రధాన డిమాండ్ల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సహకరించని రాజకీయ పార్టీలకు నాయకులకు తాము కూడా ఇక సహకరించమని తేల్చి చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాష్ర్ట సంఘం గౌరవాధ్యక్షులు ముత్యాల హరికృష్ణ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి సగర, రాష్ర్ట ముఖ్య సలహాదారులు ఆర్బి ఆంజనేయులు సగర, గౌరవ సలహాదారులు రామ్ సాగర్, సగర ఆత్మగౌరవ భవన వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ అస్కాని మారుతీ సగర, యాదాద్రి అన్నదాన సత్రం అధ్యక్షులు కె.పి రాములు సగర, రాష్ర్ట మాజీ అధ్యక్షులు బంగారు నరసింహ సగర, రాష్ర్ట ఉపాధ్యక్షులు బుడ్డన్న సగర, సగర తదితరులు ఉన్నారు.