12-10-2025 10:13:42 PM
కోరుట్ల రూరల్ (విజయక్రాంతి): కారు ద్విచక్రవాహనం ఢీకొన్న సంఘటనలో వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావుపేట గ్రామ శివారులో కారును ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఆదివారం సాయంత్రం గుమ్లాపూర్ గ్రామానికి చెందిన ఇల్లెందుల శ్రీనివాస్(44) తన ద్విచక్రవాహనంపై కోరుట్లకు వస్తుండగా అదే క్రమంలో జగిత్యాల వైపు వెళ్తున్న కారును ద్విచక్రవాహనం వేగంగా ఢీకొట్టడంతో ఇల్లెందుల శ్రీనివాస్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.