calender_icon.png 13 October, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుండీ చోరీ వ్యక్తి అరెస్టు..

12-10-2025 09:54:26 PM

ఉప్పల్ (విజయక్రాంతి): దేవాలయంలో హుండీల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాచారం సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ గోకుల్ నగర్ శ్రీమాతా ముగ్గురు అమ్మవారు ఆలయంలో ఆదివారం పొద్దున అమ్మవారి ఆలయ అర్చకుడు శివరామ ప్రసాద్ రోజులాగే దేవాలయానికి వచ్చి తాళాలు తీద్దామనుకున్న లోపు ప్రధాన ద్వారం తాళాలు విరిగి ఉండడం గమనించి లోపలికి వెళ్లి చూడగా అమ్మవారి ఆభరణాలు కనిపియకపోవడంతో నాచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు 24 గంటలు కాకముందే సీసీ కెమెరా ఆధారంగా నిందితుడు టాకీ కేర్ కిషోర్ ని పోలీసులు గుర్తించారు. గుర్తించిన నిందితుని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు నాచారం పోలీసులు తెలిపారు.