18-09-2025 12:01:20 AM
-విజేతలకు బహుమతులు అందజేత అతిథులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ (విజయక్రాంతి): ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లక్డికాపూల్‌లోని ఐఐఎంసీ కళాశాల, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం మంగళ, బుధవారాల్లో అంతర్ కళాశాలల క్యారమ్స్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్‌కి ముఖ్య అతిథిగా ఓయూ ప్రొఫెసర్ రాజేష్ కుమార్, గౌరవ అతిథులుగా యూసీపీఈ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. సునీల్ కుమార్, ఐఐఎంసీ ప్రిన్సిపాల్ కూర రఘువీర్, కళాశాల విద్యార్థి వ్యవహారాల డీన్ డాక్టర్ జి. సంతోషి హాజరయ్యారు.
ఓయూ పరిధిలోని 22 కళాశాలల నుంచి విద్యార్థులు క్యారమ్స్ పోటీల్లో పాల్గొన్నారు. విజేత జట్లకు ముఖ్య అతిథి ఓయూ ఐయూటీ కార్యదర్శి ప్రొఫెసర్ రాజేష్ కుమార్ ప్రిన్సిపాల్ కూర రఘువీర్ తో కలిసి బహుమతులు అందజేశారు. అలాగే ఐఐఎంసీ ప్రిన్సిపాల్ విజేతలకు రూ. ఐదు వేలు నగదు బహుమతిని అందించారు. కాగా టోర్నీ విజేతలుగా భవన్స్ కళాశాల, సైనిక్‌పురి (2-1),బద్రుక కళాశాల, కాచిగూడ (1-2), డాక్టర్ బీఆర్. అంబేద్కర్ కళాశాల బాగ్ లింగంపల్లి (2-1),ఎంజేబీపీ డిగ్రీ కళాశాల, మెదక్ (1-2) నిలిచారని ఐఐఎంసీ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సహాయచార్యులు పి.కిషన్ గౌడ్ తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో రాజేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.