calender_icon.png 3 September, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీమెయిల్ పాస్‌వర్డ్స్ మార్చుకోండి

01-09-2025 01:44:45 AM

  1. టూ స్టెప్ వెరిఫికేషన్‌ను తప్పనిసరిగా ప్రారంభించుకోండి

ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేసిన గూగుల్

ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ యూజర్లను అప్రమత్తం చేసిన సంస్థ

న్యూఢిల్లీ, ఆగస్టు 31: ప్రముఖ సంస్థ గూ గుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2.5 బిలియన్ జీ మెయిల్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. వారు తమ పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చుకోవాలని సూచించింది. అంతే కా కుండా టూ స్టెప్ వెరిఫికేషన్ (2ఎస్‌వీ) ని త ప్పనిసరిగా ప్రారంభించుకోవాలని స్పష్టం చే సింది. హ్యాకింగ్ ప్రయత్నాలు పెరగడం వల్లే ఇలా అలర్ట్ జారీ చేసినట్టు గూగుల్ తెలిపింది.

హ్యాకింగ్ వెనుక ‘షైనీ హంటర్స్’ అనే ఇంటర్నేషనల్ హ్యాకర్ల ముఠా ఉందని గుర్తించినట్టు పేర్కొంది. ఈ ముఠా 2020 నుంచి యాక్టివ్‌గా ఉంది. ఈ ముఠాకు చెందిన హ్యాకర్లు ఫిషింగ్ పద్ధతిని ప్రధాన ఆయుధంగా వాడుతున్న ట్టు గూగుల్ సంస్థ పేర్కొంది. టూ స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవడం వల్ల మె యిల్ అకౌంట్‌కు అదనపు సెక్యూరిటీ అం దించొచ్చు. హ్యాకర్లు మీ పాస్‌వర్డ్‌ను తెలుసుకున్నా కానీ కోడ్ లేనిది లాగిన్ కాలేరు.