15-11-2025 07:49:34 PM
కొండాపూర్: కొండాపూర్ మండల పరిధిలోని గంగారం గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకై విద్యుత్ అధికారీ డిఈ లక్ష్మణ్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అనంతరం ప్రజలతో కలిసి గ్రామంలో సమస్యలను నేరుగా పరిశీలన చేసి, దిగువ అధికారులకు సూచనలు సలహాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రధానమైన సమస్య ట్రాన్స్ఫార్మర్ ఇండ్ల మధ్యలో ఉండడంతో మనుషులకు ప్రమాదకరంగా మారి, వారి పశువులు మృతి చెందుతున్నాయని తెలిపారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేయాలని, పాత స్తంభాలను మార్చాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారి వీరారెడ్డి, మండల విద్యుత్ అధికారి సిద్ది రాజ్, లైన్మెన్ హలీం, స్థానిక గ్రామ యువకులు పాల్గొన్నారు.