calender_icon.png 23 July, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓ ఇంట్లో భారీగా నగదు పట్టివేత

11-05-2024 02:06:19 AM

మనీ ఎక్స్‌చేంజ్ చేస్తున్నట్లు చెప్పిన వ్యక్తి

పాత నోట్లు తీసుకుని కొత్తవి ఇచ్చే వ్యాపారం చేస్తానని వెల్లడి

అనుమతి పత్రాలు లేవని స్వాధీనం చేసుకున్న పోలీసులు

భోపాల్ (మధ్యప్రదేశ్), మే 10 : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ వ్యక్తి వద్ద భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. పంత్‌నగర్ కాలనీకి చెందిన 38 ఏళ్ల కైలాశ్ ఖత్రీ ఇంట్లో పోలీసులు అనేక పెద్ద నోట్ల కట్టలను గుర్తించారు. ఈ విషయంలో అతన్ని ప్రశ్నించగా.. తాను కమీషన్ మీద పాత నోట్లను మారుస్తానని వెల్లడించాడు. ఈ వ్యాపారాన్ని తాను 18 ఏళ్లుగా చేస్తున్నానని అతను తెలిపాడు. పాడైన, చిరిగిన రూ.5, రూ.10, రూ.20 డినామినేషన్లలో తీసుకుని కమీషన్ మీద కస్టమర్లకు కొత్త నోట్లను ఇస్తాడు. అయితే ఈ విధంగా వ్యాపారం చేయడానికి అతని వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేవని భోపాల్ ఒకటో జోన్ డీసీపీ ప్రియాంక శుక్లా వెల్లడించారు. సోదాల్లో రికవరీ చేసిన డబ్బు విషయంపై ఆదాయపు పన్ను శాఖకు కూడా సమాచారం ఇచ్చినట్లు శుక్లా తెలిపారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు రికవరీ చేసినట్లయితే పరిగణనలోకి తీసుకుంటామని ఐటీ శాఖ వెల్లడించినట్లు ఆమె చెప్పారు. ఇంకా నోట్ల లెక్కింపు జరుగుతోందని తెలిపారు.