calender_icon.png 12 September, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశువుల దొంగల అరెస్టు

12-09-2025 12:18:07 AM

  1. 14.50 లక్షల విలువైన ఆస్తి స్వాధీనం

విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డి జానకి 

నవాబ్ పేట, సెప్టెంబర్ 11 : పశువుల దొంగలను పశువుల దొంగలను అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. గురువారం నవాబ్ పేట మండలంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో పశువుల దొంగతనాలపై పో లీసులు కఠిన చర్యలు తీసుకుంటూ, నలుగురు నిందితులను పట్టుకున్నామని పేర్కొ న్నారు.

మరికల్ గ్రామ శివారులో పశువులు దొంగతనం జరిగినట్టు ఫిర్యాదు నమోదైందని తెలిపారు. ఫిర్యాదుదారు అంబటి రా ములు, మరికల్ గ్రామం, చౌడపూర్ మండలం తన పొలంలో పశువులను దొంగతనం చేయబడ్డారని తెలిపాడు.కేసు నమో దు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఈ నెల 11వ తేదీన 7 గంటల సమయంలో న వాబ్పేట్ పోలీసులు కన్మన్ కల్వ గ్రామ శివారులో పెట్రోలింగ్ చేస్తుండగా, అనుమా నాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను బొలెరో వాహనంలో అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో వారు పశువుల దొంగతనాలను చేసినట్లు ఒప్పుకున్నారు. పశువులు 9 దూడలు 6 లను స్వాధీనం చే సుకున్నట్లు తెలిపారు. A1 కుమ్మరి అశోక్ కుమార్, A2 సర్దన్ అఖిల్,A3 తాటిపల్లి సా యి కుమార్, A4 బుర్క సాయి అరెస్టు చేసినట్లు తెలిపారు. మొత్తం రూ.14,50,000 ఆస్తి విలువస్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో ఎస్‌ఐ ఎం.వి క్రం, ఎఎస్‌ఐ ఎస్.జానర్ధన్, జి.వెంకట్రాములు, సురేష్ బాబు, భాస్కర్, శెట్టి నాయిక్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి నవాబ్పేట్ పోలీస్ బృందాన్ని అభినందించి క్యాష్ రివార్డ్ ఇచ్చారు. సీసీ కెమెరాలు వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. అవి ఉండడం వల్లే ఇలాంటి దొంగతనాలను గుర్తించడం, అరికట్టడం సులభమవుతుంది. ప్రతి ఒక్కరూ తమ ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు.