12-09-2025 12:17:04 AM
జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్ధిపేట కలెక్టరేట్, సెప్టెంబర్ 11:జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో ప్ర తి నెలా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.
సేకరించిన రక్తాన్ని సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న పేద రోగులకు ఉచితంగా అందజేస్తామని చెప్పారు. విద్యార్థులను రక్తదానం చేసినందుకు అభినందించి, పం డ్లు,జ్యూస్ అందజేశారు. జువాలజీ ల్యాబ్ పరిశీలించిన కలెక్టర్, ల్యాబ్ నిర్వహణపై కళాశాల యాజమాన్యాన్ని ప్రశంసించారు.
అనంతరం కళాశాల ఆవరణలో మొక్కను నాటి, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు క్రమశిక్షణ, వ్యాయామం ప్రాధాన్యం వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సునీత, వైస్ ప్రిన్సిపల్ అయోధ్య రెడ్డి, జిల్లా ఆరోగ్య శాఖ అధికారి ధనరాజ్, కళాశాల సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.