calender_icon.png 19 September, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వామన్‌రావు దంపతుల హత్య కేసులో రంగంలోకి సీబీఐ

19-09-2025 01:16:19 AM

-పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో కుటుంబ సభ్యుల విచారణ

-వామన్‌రావు తండ్రి కిషన్‌రావు నుంచి వివరాల సేకరణ

-అక్కడి నుంచి మంథని కోర్టుకు.. అటు నుంచి హత్య జరిగిన ప్రదేశం రామగిరి మండలం మారుతి నగర్‌కు అధికారులు

మంథని, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ప్రముఖ న్యాయవాది గట్టు వామన్‌రావు నాగమణి దంపతుల హత్య కేసులో సీబీఐ దూకుడు ప్రారంభించింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో గురువారం సీబీఐ అధికారుల బృందం ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. ముందుగా రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు చేరుకున్న అధికారుల బృందం అనంతరం గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌ను వెంటబెట్టుకొని మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని వామన్‌రావు ఇంటికి వెళ్లారు.

అక్కడ వామన్‌రావు తండ్రి కిషన్‌రావును కలిసి వివరాలు తెలుసుకొని అక్కడి నుంచి మంథని కోర్టు ప్రాంతం, అ క్కడ నుంచి హత్య జరిగిన రామగిరి మం డ లం కలవచర్ల గ్రామపంచాయతీ పరిధి మా రుతి నగర్ వద్ద ప్రధాన రహదారిపై హత్య జరిగిన ప్రాంతంలో పరిశీలించారు. కాగా.. వామన్‌రావు - నాగమణి దంపతులు ఇద్ద రూ హైకోర్టు న్యాయవాదులుగా కొనసాగుతుండగా, 2021 ఫిబ్రవరి 17 తేదీన తమ స్వ గ్రామమైన మంథని మండలం గుంజపడు గు గ్రామానికి వచ్చి కారులో హైదరాబాద్‌కు వెళ్తుండగా రామగిరి మండలం ప్రధాన ర హదారిపై మాటు వేసి ఉన్న కొందరు కా రును అడ్డగించి కత్తులతో పట్టపగలే జనం చూస్తుండగా అతిదారుణంగా హత్య చేసిన సంఘటన విధితమే.

అనంతరం సమీపంలో ని సుందిళ్ల బ్యారేజీలో హత్యకు ఉపయోగించిన ఆయుధాలను పడేసి వెళ్లిపోయారు. అ ప్పట్లో ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రే పింది. స్థా నిక పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. అయి తే విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో హ త్యకు ప్రేరేపించిన సూత్రధారుల పైన కూ డా చర్యలు తీసుకోవాలని వామన్‌రావు తం డ్రి కిషన్‌రా వు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వపరాలను పరిశీ లించిన సుప్రీంకోర్టు ఆ కేసును సీబీఐకి బదలాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిం చింది.

కేసును సిబిఐకి అప్పగించడానికి అ భ్యంతరం లేదని ప్ర భుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో గురువా రం సీబీఐ ప్రత్యేక బృందం పెద్దపల్లి జిల్లాకు చేరుకొని కేసులో ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఆ కే సులో ప్రధాన నిందితులుగా పట్టుబడిన వా రు మాజీ ఎమ్మెల్యే మధుకు సమీప బం ధువు కావడంతో తీవ్ర చర్చ జరుగుతున్నది.