19-09-2025 01:15:28 AM
ముషీరాబాద్, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్ దోమలగూడలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శివ ప్యాలెస్ అపార్ట్మెంట్ దగ్గర హుస్సేన్ సాగర్ నాలా ఈ పొర్లడంతో రివర్స్ వాటర్ రావ డం వల్ల స్థానికంగా అపార్ట్మెంట్ వాసులు, కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వరద నీరు భారీగా చేరిందన్న విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ రచన శ్రీ, బిజెపి రాష్ట్ర నాయకులు జి. వెంకటేష్, ముషీరాబాద్ సర్కిల్- 15 డీఎంసీ రామానుజుల రెడ్డి, జిహెచ్‌ఎంసి డిఈ సన్ని వరద నీరు నిలిచిపోయిన ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. శివ ప్యాలెస్ వద్ద నిలిచిపోయిన వరద నీటిని అధికారులు తమ సిబ్బందితో తొలగించారు. ఈ కార్యక్ర మంలో బిజెపి నాయకులు సలంద్రి శ్రీనివాస్ యాదవ్, మహేందర్ బాబు, దిలీప్ యాదవ్, గంట శ్రీనివాస్, రమేష్ బాబు, పి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.