15-05-2025 12:00:00 AM
ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు
ముషీరాబాద్, మే 14 (విజయక్రాంతి) : సీబీఎస్‌ఈ-2024-25 పదవ తరగతి పరీక్షల్లో హిమాయత్నగర్ ఆక్స్‌ఫోర్డ్ గ్రామర్ హై స్కూల్ అకడమిక్ టాపర్లను స్కూల్ వైస్ చైర్పర్సన్ మణికొండ ప్రార్ధన బుధవారం ఘనంగా సన్మానించి అభినందించారు. ఆమె మాట్లాడుతూ పరీక్షల సమయంలో నివృత్తి సంజీవ్ బహేటి, రుషికా జక్కుల అనే ఇద్దరు విద్యార్థినిలు వారి తండ్రులను కోల్పోయారని తెలిపారు.
అయినప్పటికీ దుఃఖాన్ని దిగమింగి మొక్కవోని ధైర్యంతో వారు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. 45 ఏళ్ల సుధీర్ఘ అనుభవంతో విద్యా ర్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. పాఠశాల కరస్పాండెంట్ కట్టా ప్రభాకర్, డీన్ రామాంజుల, సీబీఎస్‌ఈ ప్రిన్సిపాల్ సీహెచ్.రేఖా రావు, ప్రీ-ప్రైమరీ ప్రిన్సిపాల్ ఫాతిమా ఖాజిమ్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాజ్ కుమార్ పాల్గొన్నారు.