calender_icon.png 30 July, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది ఫలితాల్లో మక్కారాజ్ పెట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

14-05-2025 10:29:18 PM

ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందించిన ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్..

చేగుంట (విజయక్రాంతి): 2024-2025 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో చేగుంట మండల మక్కారాజ్ పెట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(District Collector Rahul Raj), మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao), జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రాధా కిషన్(District Education Officer Radha Kishan) హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మెదక్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు వారు హృదయపూర్వకంగా అభినందించారు.

ఈ సందర్బంగా చేగుంట మండల్ మకరాజుపేట ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థిని, విద్యార్థులు మండలం ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారు సిహెచ్ మణికాంత్, సిహెచ్ శశాంక్, టీ మనీషా, ఈ శరణ్య, సిహెచ్ అనూషను వారు సన్మానించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ... తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు నిరాశ పడకూడదని, ఇది ఒక దశ మాత్రమేనని, ప్రయత్నాలు కొనసాగిస్తే జీవితంలో విజయం తప్పదని అలాగే ఫెయిల్ అయిన విద్యార్థులను త్వరలో నిర్వహించే పరీక్షకు సన్నద్ధం చేయాలని అందుకు సరైన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. 

మండల స్థాయిలో 559 మార్కుల వచ్చినటువంటి ఇద్దరు విద్యార్థులు మా పాఠశాలలకే చెందడం సంతోషదాయకమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అమర్ సేన రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి తెలియజేశారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి మంచి పేరు తీసుకుని రావాలని మండల విద్యాధికారి నీరజ సూచించారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను శాలువాతో ఘనంగా సన్మానించి ప్రశంస పత్రాలను అందజేశారు.